Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ లో పెట్రోల్ కొరత.. బంకుల ముందు భారీ క్యూలు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
కాగా సియాటిల్‌లో ఉంటున్న కందుల జాహ్నవి సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో జాహ్నవికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా జాహ్నవి మరణించింది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. అయితే నిందితుడి వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!