Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు…