గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర రాయ్, జస్టిస్ ఆకుల శేషసాయి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై వీరు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ…గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం తనకు అపారమైన గౌరవంగా ఉందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేదికపై మాట్లాడటం…
బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని…