Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varupula Subbarao Resigns from YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది.. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వరుపుల సుబ్బారావు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు పరుపుల సుబ్బారావు.. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు..
అయితే, వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో తన సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. తన వయసు ఎక్కువైందని వైఎస్ జగన్ గతంలో చెప్పేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వరుపుల సుబ్బారావు వెల్లడించారు. అయితే జనసేన నుంచి తాను ఎలాంటి పదవి లేదా ప్రత్యేక కమిట్మెంట్ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014-2019 మధ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, కాకినాడ జిల్లాలో ఇటీవల వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా, జనసేనలో చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!