Pawan Kalyan: పిఠాపురంలో పార్టీ ప్రక్షాళనపై పవన్ కల్యాణ్ ఫోకస్.. ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి తొలగింపు..
- పిఠాపురంలో పార్టీ ప్రక్షాళన పై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్..
- ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి తొలగింపు..
- 2 నెలల క్రితం ఇంఛార్జ్ స్థానంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురితో కమిటీ..
- మర్రెడ్డిపై వస్తున్న ఫిర్యాదులతో ఫైవ్ మెన్ కమిటీ నుంచి కూడా తొలగింపు..
- మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిషోర్ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో బలోపేతం, శ్రమించిన వారికి గుర్తింపు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం పిఠాపురంలో పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే, గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను రెండు నెలల క్రితం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
Read Also: Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
అయితే, గత కొంత కాలంగా మర్రెడ్డి పై పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ పనితీరుకు ఆటంకంగా మారిన అంశాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరో కీలక చర్య తీసుకున్నారు. దీంతో మర్రెడ్డిని ఫైవ్ మెన్ కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మర్రెడ్డి స్థానంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న, చేబ్రోలు ప్రాంతంలో జనసేన పార్టీ సమావేశాలు, కార్యకర్తలకు నివాసం, వసతి వంటి సౌకర్యాలు అందించిన ఓదూరి కిషోర్‌ను కొత్త సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పిఠాపురంలో పార్టీ ఆర్గనైజేషన్ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే ఎన్నికలకు ముందు జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు జనసేన నేతలు..
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..