Deputy CM Pawan Kalyan: పిఠాపురం కమిషనర్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? నేను అయితే ఇలాంటి చోట ఒక్క రోజు కూడా ఉండలేను. అసలు నేను చీపురు పట్టి రోడ్లు తుడవాలా? అంటూ అధికారులను నిలదీశారు.
Read Also: USSD Scam : జాగ్రత్త.! ఒక్క కాల్‌తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.. కొత్త USSD స్కామ్ వెలుగులోకి.!
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఇక, పిఠాపురంలో పారిశుధ్య నిర్వహణ విఫలమవుతున్న నేపథ్యంలో.. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ కార్యక్రమాన్ని కూడా తానే స్వయంగా నిర్వహించాలా? అని పవన్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రకటించినా, దాని అమలు విషయంలో వేగం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ-పరమైన అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా? అభివృద్ధి కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేయొద్దా? అని అధికార పార్టీ నేతలను, యంత్రాంగాన్ని నిలదీశారు.
కాలనీల్లో నడుచుకుంటూ సమస్యలు తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, చెత్త నిర్వహణ, మౌలిక వసతుల కొరతపై ప్రజలు చెప్పిన అంశాలను ఆయన నోట్ చేసుకున్నారు. అయితే, పిఠాపురం పారిశుధ్య వ్యవస్థను వెంటనే మెరుగుపర్చాలని, అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!