Cyber Fraud: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి రిటైర్మెంట్ ద్వారా వచ్చిన సొమ్మును సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. రిటైట్ ఉద్యోగినికి ఇటీవల పదవి విరమణ చేయడంతో 30 లక్షల రూపాయల నగదు బ్యాంకులో జమ అయింది. దీన్ని గమనించిన సైబర్ కేటుగాళ్లు.. తాము సీబీఐ ఆఫీసర్లం.. మీ బ్యాంకులో ఉన్న డబ్బులను తమకు ఇవ్వాలని లేదంటే మీ కుమారులను చంపేస్తామని వీడియో కాల్ ద్వారా బెదిరింపులకు దిగారు.
Read Also: Seema Haider: ప్రశ్నార్థకంగా సీమా హైదర్ భవితవ్యం! 48 గంటల్లో వెళ్లకపోతే..!
అయితే, సైబర్ కేటుగాళ్ల మాటలకు బెదిరిపోయి ఆన్లైన్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగి నగదు బదిలీ చేశారు. ఇక, మోసపోయమని తెలిసి కొత్తపేట పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ముంబై కేంద్రంగా సైబర్ మోసగాళ్లు బ్యాంక్ లావాదేవీలు జరిపినట్లు కొత్తపేట పోలీసులు గుర్తించారు.