Site icon NTV Telugu

Ambati Rambabu: ముద్రగడను కలిసిన అంబటి.. కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకున్న పట్టుదల, నీతి, నిజాయితీ కలిగిన నాయకుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, తన కాపు కులం లో పుట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. “ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. జుట్టుపట్టుకొని లాకెళ్లిన పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసింది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Band Melam Movie Review: ‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ!

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. “నాపై ఎన్ని కేసులు పెట్టినా, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాను. పోలీసులు 7 గంటలకు 20 నిమిషాలు హింసించారు. అర్ధరాత్రి తీసుకెళ్లి కాళ్లు పగలగొట్టి ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వాన్ని వదలను. బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను వదలేది లేదని, ఇప్పటికే రెండు రిట్ పిటిషన్‌లను హైకోర్టులో దాఖలు చేశారన్నారు. ఆయన పేర్కొన్నారు, తన పార్టీ మరియు తన కులం కలిసి దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు..

Exit mobile version