Band Melam Movie Review: ‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: Harsh Roshan, Sridevi
- DIRECTOR: Sathish Javvaji
- MUSIC: Vijay Bulganin
- PRODUCER: Kavya and Shravya
Band Melam Movie Review: గతేడాది చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కోర్ట్’ సినిమా గుర్తుందిగా? అందులోని హర్ష రోషన్, శ్రీదేవిల జంట యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ హిట్ పెయిర్‌ను వెండితెరపై మళ్ళీ చూడాలని ఆశపడ్డ ప్రేక్షకులకు, ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన ‘బ్యాండ్ మేళం’ ఒక ఆప్షన్‌గా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
తెలంగాణలోని బ్రహ్మాణపల్లి అనే గ్రామంలో పెరిగిన బావామరదళ్లు యాదగిరి (హర్ష రోషన్), రాజీ (శ్రీదేవి) కి చిన్నప్పటి నుంచే వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు (గోపరాజు విజయ్, సాయికుమార్) నిర్ణయిస్తారు. అయితే, యాదగిరికి చదువు అబ్బదు కానీ మ్యూజిక్ అంటే ప్రాణం, రాజీ మాత్రం చదువులో టాపర్. యాదగిరి నిర్లక్ష్యం చూసి రాజీ కోప్పడటం, వారిద్దరి మధ్య గ్యాప్ రావడం.. ఆ తర్వాత రాజీ పైచదువుల కోసం పట్నం వెళ్లడం చకచకా జరిగిపోతాయి. ఊరిలోనే ఉండిపోయిన యాదగిరి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక మ్యూజిక్ బ్యాండ్ పెడతాడు. కానీ అదృష్టం కలిసిరాక అప్పుల పాలవుతాడు. సరిగ్గా అదే సమయంలో రాజీకి వేరే సంబంధం ఖాయం చేస్తాడు ఆమె తండ్రి సాయన్న (సాయికుమార్). యాదగిరి తన ప్రేమను గెలుచుకున్నాడా? రాజీ పెళ్లి పీటల మీద నుంచి ఎందుకు లేచిపోయింది? చివరకు ఈ బావామరదళ్లు ఒకటయ్యారా? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
కోన వెంకట్ అంటే ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్, అయితే ఈ సినిమాలో ఆయన మార్కు పాతకాలపు ‘ఫార్ములా’ స్పష్టంగా కనిపిస్తోంది. కథలో కొత్తదనం కంటే, పాత సినిమాల్లో చూసిన డ్రామానే ఎక్కువగా అనిపిస్తుంది. గ్యాప్ తీసుకుని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన కథతో బ్యాండ్ మేళం మూవీ తీసినా సినిమా చూశాక కోన వెంకట్ ఇంకా అప్ డేట్ కాలేదని అర్థమవుతుంది. అదే పాత కామెడీతో ఈ మూవీని తీసుకొచ్చారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బ్యాక్ డ్రాప్ మార్చారో ఏమో కానీ. అది ఫోర్సబుల్ అనిపిస్తుంది. ఆ యాస పలికేవిధానం కొంత ఫోర్స్ గానే ఉంటుంది. జబర్దస్త్ మార్క్ కామెడీ సీన్లని రాసుకుని దీనికి లవ్ ట్రాక్‌ని, అందులో డ్రామాని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో మొదట యాదగిరి, రాజీ ఫ్యామిలీ నేపథ్యాలను చూపించి, గిరి, రాజీల స్నేహం, ప్రేమ, తర్వాత మూవీ కామెడీ డ్రామా వైపు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. స్టూడియో కోసం దొంగతనాలు చేయడం మరీ లాజిక్ లెస్. కండాఫ్‌లో అసలు కథ రాసుకున్నాడు. మరదలు హ్యాండివ్వడం, వేరే వాడితో లేచిపోవడం, తర్వాత చోటు చేసుకున్న డ్రామా సహా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించేలా ఉంది.
నటీనటుల ప్రతిభ:
హీరోగా హర్ష రోషన్ కుర్రాళ్ల పాత్రల్లో ఒదిగిపోయాడు. తనదైన తెలంగాణ యాసతో, టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శ్రీదేవి చూడటానికి బాగున్నా, ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. గోపరాజు విజయ్, సాయికుమార్ వంటి సీనియర్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హీరో స్నేహితుల బృందం ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది.
సాంకేతిక వర్గం:
విజయ్ బుల్గానియన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మరీ లౌడ్‌గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఫైనల్లీ: ఈ ‘బ్యాండ్ మేళం’ సౌండ్ అస్సలు చాల్లేదు
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?