ATM Cash Robbery: ఏటీఎం క్యాష్ కొట్టేశాడు.. భయంతో కారులోనే డబ్బు వదిలి పారిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM Cash Robbery: కడప జిల్లాలో ఏటీఎం క్యాష్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. కడపలోని పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలు అధికారులు సీఎంఎస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ నెల 16న కడప నగరంలోని ఏటీఎంలలో రూ.71 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. ఈ మేరకు సీఎంఎస్ యోధ వాహనంలో క్యాష్ కస్టోడియన్ సునీల్‌తో పాటు మహేంద్ర రెడ్డి లోహియానగర్‌లోని ఓ ఎస్‌బీఐ ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనం డ్రైవర్ షేక్ ఉమర్ ఫరూక్ ఏటీఎం క్యాష్ బాక్సుతో ఉడాయించాడు. దీంతో సిబ్బంది కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాష్ బాక్సులో రూ.56 లక్షల నగదు ఉందని వారు వివరించారు.
Read Also: Vidadala Rajini: ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఏటీఎం క్యాష్ కస్టోడియన్ మంత్రి సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. వాహనంలో ఉన్న జీపీఎస్ లోకేషన్ ఆధారంగా పోలీసులు వినాయక నగర్‌లో ఓ కార్ షెడ్డులో క్యాష్ వ్యాన్‌ను గుర్తించారు. అయితే అందులో నగదు బాక్సు మాత్రం లేదు. ఈ కేసులో ఫరూక్‌కు మహబూబ్ బాషా అనే వ్యక్తి సహకరించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫరూక్ మొబైల్ నంబర్ ఆధారంగా అతని కదలికలను గుర్తించారు. కడప పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను తనిఖీ చేయడంతో డ్రైవర్ ఫరూక్ పులివెందుల వైపు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అనంతపురం, కర్ణాటక సరిహద్దుల్లో టోల్ గేట్ల వద్ద వాహనాలను పోలీసులు పరిశీలిస్తుండగా షేక్ ఫరూక్ గమనించి తన వాహనాన్ని వదిలి పారిపోయాడు. టోల్ గేటు అధికారుల సహకారంతో కడప పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న రూ.53.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు మహబూబ్ బాషా బంధువులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!