కేజీహెచ్ లో సమ్మెబాట పట్టారు జూడాలు. గుంటూరులో డాక్టర్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగ్గారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం దారుణం అంటూ తెలిపారు. మా సేవలను గుర్తించక పోయినా పర్లేదు కానీ దాడులు చేయడం ఘోరం. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. కానీ ఇప్పుడు వరసగ వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి. మాకు రక్షణ లేకుండా పోయింది, మాకు భద్రత కల్పించాలి అని పేర్కొన్నారు. అలాగే దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చూడాలి అని డిమాండ్ చేసారు.