విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీసింది.. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఆటో రసీదులపై మతపరమైన ప్రచారం జరుగుతుండడం వివాదానికి దారి తీసింది.. చలాన రశీదుపై ఒక మత ప్రచారానికి సంబంధించిన కీర్తనలు, ఫోటో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.. రైల్వేస్టేషన్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఓ ఆటో డ్రైవర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఇందుకు గాను రూ.80 ఫైన్ విధించారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, అనూహ్యంగా ఆ రశీదుపై ఉన్న ఫోటో, కీర్త వివాదానికి తెరతేసింది.. ఆ రశీదు కాస్తా.. సోషల్ మీడియాకు ఎక్కింది.. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది… విమర్శలు మొదలయ్యాయి.. అయితే, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాజకీయ పార్టీలు విమర్శలకు దిగడంతో దుమారం చెలరేగింది..
Read Also: Rupee: షాకింగ్.. భారీగా పడిపోనున్న రూపాయి మారకం విలువ
ఇక, దీనిపై విశాఖ సిటీ పోలీసు స్పందించారు. ఇది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పొరపాటును గుర్తించి ఆ రశీదులన్నీ రద్దు చేసినట్లు ప్రకటించారు. సాధారణంగా ట్రాఫిక్ చాలాన్ రశీదు బుక్స్ పై ప్రకటనలు వేసుకునే అవకాశం ఉంది. నగరంలో వివిధ వస్త్ర, బంగారం షాపులు ఈ తరహా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే, ఒక మతానికి సంబంధించిన ఫోటో, కీర్తనలతో కూడిన రశీదు ఇప్పుడు బయటకు రావడంతో అన్యమత ప్రచారం ప్రోత్సహిస్తున్నారనే అపవాదు ట్రాఫిక్ పోలీసులపై పడింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారానికి తెరదింపారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన.. ఆ రశీదుపై.. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు పోలీసులు..
The slips handed over by one autodriver to head constable unfortunately with his ignorance in emergency he distributed the slips. It was stopped immediately after coming to notice . It was not done intentionally.
— VizagCityPolice (@vizagcitypolice) November 25, 2022