భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అభినందించారు ఒకప్పటి సినీనటి, రాజకీయ నేత జయప్రద. మీ పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ లో ప్రథమ మహిళను కలిశారు జయప్రద… ఆమె పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన జయప్రద ఎన్టీఆర్ పిలుపుతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షాన చేరి తెలుగు దేశము పార్టీ మహిళా విభాగమునకు అధ్యక్షురాలయ్యారు. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన టీడీపీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికయ్యారు.
2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్‌పై తిరుగుబాటు చేసిన జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడ్డారు జయప్రద.. అనంతరం అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్‌లో చేరారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత 2014లో అమర్ సింగ్‌తో పాటు జయప్రద అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. జయప్రద ఆర్ ఎల్ డి అభ్యర్థిగా బిజ్నోర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి… నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బీజేపీలో చేరారు. అయితే ఆమెకు ఎక్కడా టికెట్ లభించలేదు. ఇటీవల తన స్వస్థలం రాజమండ్రికి వచ్చిన జయప్రద రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆమె బీజేపీ తరఫున ఏపీలో లోక్ సభకు పోటీచేస్తారని భావిస్తున్నారు.
Iraq Protest: ఇరాక్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చి.. ప్రధాని అభ్యర్థిత్వంపై నిరసనకారుల ఆగ్రహం