నేడు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అయితే రేపు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం నడుస్తునా విషయం తెలిసిందే. దీని పై రేపు సమావేశం తర్వాత జనసేన స్పందిస్న్చే అవకాశం ఉంది.