NTV Telugu Site icon

Potina Mahesh: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా?

Potina Mahesh

Potina Mahesh

Potina Mahesh: వైసీపీ నేతలపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం జరిగిందో అంబటి‌ చూశాడా అని ప్రశ్నించారు. లోపలకు‌ వెళ్లి సోఫాల‌ కింద దూరి విన్నావా అంబటి అని నిలదీశారు. బాబు-పవన్ కలిస్తే వైసీపీ నేతలకు ఎందుకు భయం అని సూటి ప్రశ్న వేశారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, కారుమూరు నాగేశ్వరరావు జగన్ చెప్పు చేతల్లో పని చేసే మంత్రులు అని పోతిన మహేష్ విమర్శలు చేశారు. వాళ్ల వాళ్ల శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు కనీసం అవగాహన లేదని చురకలు అంటించారు. వెల్లంపల్లికి మతి సరిగా ఉందో లేదో ఆస్పత్రిలో‌ చూపించుకోవాలన్నారు. మసాజ్ కల్చర్ వెల్లంపల్లిది కాబట్టి.. ఆయనకు అవే గుర్తుకు వస్తాయన్నారు. వెలంపల్లి నోరు అదుపులో పెట్టుకోకుంటే.. ఆయన అమ్మాయిలతో చేయించుకునే మసాజ్ వివరాలు బయటపెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు.

Read Also: Viral Video: ప్రధాని మోదీ వస్తున్నారని.. ఎండిపోయిన గడ్డికి గ్రీన్ కలర్

జీవో నెంబర్ 1తో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. జీవో నంబర్ 1 అంశంపైనే‌ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారన్నారు. వైసీపీ వరాహాలు గుంపులుగా వచ్చి పవన్ కళ్యాణ్‌పై విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. తాము వారాహి అని పేరు పెడితే.. వైసీపీ వరాహాలు ఏదేదో వాగాయని.. ఇక వారాహి రోడ్ మీదకు వస్తే.. ప్యాంట్లు తడుపుకుంటారని చురకలు అంటించారు. భయంతో నోరు పారేసుకుంటోన్న వైసీపీ నేతలకు ఆంజనేయుని తాయిత్తులు పంపుతామన్నారు. కేసీఆర్ దత్త పుత్రుడు జగన్ అని.. అందుకే ఇక్కడ నాశనం చేసి.. అక్కడ అభివృద్ధికి సహకరించారన్నారు. వైసీపీ చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ఏపీని సర్వనాశనం‌ చేసేందుకే వైసీపీ పుట్టిందన్నారు. పండుగ చేసుకునేందుకు కనీసం డబ్బులు లేక పేదలు నరకం‌ చూస్తున్నారన్నారు. జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం అనేలా చేశారని.. ప్రజలు బయటకి వచ్చి తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదని పోతిన మహేష్ మండిపడ్డారు.

Show comments