Naga Babu: విమర్శలు చేయడం తప్ప.. ఏపీ మంత్రులకు ఏ పని లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Leader Naga Babu Fires On AP Ministers: జనసేన నేత కొణిదెల నాగబాబు మరోసారి ఏపీ మంత్రులపై నిప్పులు చెరిగారు. విమర్శలు చేయడం తప్ప ఏపీ మంత్రలకు ఏ పని లేదని.. మంత్రులకు తాము చేయాల్సిన పని వారు చేయడం లేదని విమర్శించారు. శ్రీకాకుళంలో రణస్థలం, యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో నాగబాబు మాట్లాడుతూ.. యువకులతో సభ అనేది చాలా అవసరమన్నారు. అలోచన, ఆవేదన చెప్పడానికి ఈ సభ మంచి అవకాశమని పేర్కొన్నారు. యువత చాలా పవర్‌ఫుల్ అని, ఈ సభను యువత ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ కంకణం కట్టుకుందన్నారు. సభకు తాము పెట్టిన రణస్థలం పేరు.. యూత్ పవర్‌కి తగ్గట్టుగా ఉందన్నారు. ఏపీలో ఈరోజు ఉద్యోగాలు గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ లేవని మండిపడ్డారు. యువతకు తమ జనసేన పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసానిచ్చారు.
Longest River Cruise: గంగానదిలో ప్రపంచంలోనే అతిపొడవైన రివర్ క్రూయిజ్.. ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
అంతకుముందు జీవో నం.1 తీసుకురావడంపై కూడా నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ జీవోని వెనక్కి తీసుకుంటే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్‌ను ఎంత ఆపితే.. అంతే లెగుస్తారన్నారు. రాజకీయ పార్టీగా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే.. మంత్రి రోజాపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి రోజాది నోరు కాదని, అదో మున్సిపాలిటీ చెత్త కుప్ప అని వ్యాఖ్యానించారు. ఓవైపు ఏపీ పర్యాటక వాఖ నేషనల్ ర్యాంకింగ్స్‌లో పడిపోతుంటే, మరోవైపు రోజా బాధ్యత మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. పదవి నుంచి రోజా దిగిపోయేలోపే ఆ ర్యాంకింగ్ 20కి పడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. అయితే.. ఇందుకు రోజా కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. పర్యాటక రంగంలో ఏపీ మూడో స్థానంలో ఉందంటూ.. సాక్ష్యాలతో స్పందించారు.
Nadendla Manohar: వనరులు దోచుకొని.. నాయకత్వాన్ని ఎదనీయడం లేదు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?