Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Jagananna Suraksha Got Huge Response From Ap People

Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్‌ హిట్‌.. తొలిరోజు 3,69,373 సర్టిఫికెట్లు జారీ

Published Date :July 1, 2023 , 10:48 pm
By NTV WebDesk
Jagananna Suraksha: జగనన్న సురక్ష సూపర్‌ హిట్‌.. తొలిరోజు 3,69,373 సర్టిఫికెట్లు జారీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagananna Suraksha Got Huge Response From AP People: జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు.. ఈ శిబిరాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ముఖ్యంగా.. వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సమయం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదాయం, కుల సహా పెద్ద సంఖ్యలో వివిధ సర్టిఫికెట్లను అందుకున్నారు. అర్హులై ఉండి, ఏ ఒక్కరూ లబ్ది అందకుండా మిగిలిపోకూడదన్న ముఖ్య ఉద్దేశంతో.. జగనన్న ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష. ఈ కార్యక్రమం కింద తొలిరోజు 1305 గ్రామాల్లో ఆయా మండలాలకు చెందిన అధికారులు శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా… ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహసారధులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు.

Times Now Survey: ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే.. వైసీపీదే ఘనవిజయం

సరైన ధృవపత్రాలు లేని కారణంగానో లేక ఇతరత్రా కారణాల వల్లనో.. అక్కడక్కడా పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారిని జల్లెడపట్టి, వారి వివరాలను సేకరించి, వారికి అవసరమైన పథకాలతో పాటు సేవలు అందించే ఈ కార్యక్రమం తొలిరోజు చురుగ్గా సాగింది. ఈనెల 23న ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన తర్వాత.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. అర్హత ఉండి కూడా.. వివిధ కారణాల వల్ల పథకాలు అందని, అలాగే సర్టిఫికెట్లు పొందని వారి వివరాల్ని సేకరించారు. ఈ సర్వీసులన్నింటినీ రిజిస్టర్‌ చేసిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఆయా మండలాలకు చెందిన అధికారులు వీటిని పరిశీలించి.. జగనన్న సురక్ష క్యాంపులకు వెళ్లేముందే పూర్తిస్తాయిలో సన్నద్ధమయ్యారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి మండలానికీ 2 క్యాంపులు చొప్పున జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించారు. అక్కడిక్కడే సర్టిఫికెట్లు జారీచేసేందుకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా ఎలాంటి సమస్యలు లేకుండా తొలిరోజు పౌరులకు సేవలు అందించగలిగారు. ఈ కార్యక్రమంలో మొత్తం 22,728 మంది వాలంటీర్లు పాల్గొనగా.. వారు 14,28,481 మంది కుటుంబాలను కవర్‌ చేశారు.

Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..

తొలిరోజు క్యాంపుల్లో 4,42,840 సర్వీసులు రిజిస్టర్‌ కాగా, అక్కడికక్కడే 3,69,373 సర్టిఫికెట్లు జారీచేశారు. ఇందులో.. ఆదాయం, కులం ధృవీరణ పత్రాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. అలాగే మరణ, జనన ధృవీకరణ పత్రాలు కూడా చాలామంది పొందారు. చాలా రోజులుగా సరైన ధృవపత్రాలు లేకపోవడం వల్ల ఈ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడ్డామని, జగనన్న సురక్ష క్యాంపులు ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని జనాలు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ఈ సర్టఫికెట్లు పొందిన వారు, గతంలో పథకాలు అందకుండా మిగిలిపోయిన వారు అర్హత సాధిస్తారు. అలాగే ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు పొందడానికి ఈ క్యాంపులు బాగా ఉపయోగపడ్డాయి. మ్యుటేషన్‌ కోసం చాలామంది తమ సర్వీసులను రిజిస్టర్‌ చేసుకున్నారు. అవసరాలను బట్టి.. అక్కడక్కడ వైద్యసేవలు కూడా జగనన్న సురక్ష క్యాంపుల్లో నిర్వహించారు. జులై 1 నుంచి నెలరోజులపాటు 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సురక్ష క్యాంపులను నిర్వహిస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt schemes
  • ap news
  • ap volunteers
  • Jagananna Suraksha
  • Students Certificates

తాజావార్తలు

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

  • Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

  • AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

  • Iran-US War: ఏ పాపం చేసిందని అధికారి భార్యను చంపేశారు.. ప్రపంచానికి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ సూటి ప్రశ్న

  • Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions