Minister Satyakumar: మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడింది తానే ఒకసారి చూసుకుంటే.. ఆయన అవగాహనా రాహిత్యం అర్థం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.. సంపూర్ణ అవగాహన లేని వ్యక్తిని గతంలో సీఎంగా ఎన్నుకున్నామా అనిపించేలా ఆయన మాటలు కనిపిస్తాయి.. అడ్డదిడ్డమైన వితండ వాదన చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ఆయనే తెలుపుకున్నారు.. రాజధాని అంశంలో డొంక తిరుగుడు మాటలు మాట్లాడారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.
Read Also: JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…
ఇక, నదీ గర్భంలో రాజధాని అమరావతి ఉందని అనడం అవగాహన రాహిత్యం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న రాజధానులే అభివృద్ధి చెందిన విషయం తెలుసుకోవాలి.. అవాకులు చవాకులు పేలుతూ కాలి కింద నేల కదలకుండా, పార్టీలో నాయకులు వెళ్ళిపోకుండా చూసుకుంటున్నారు అని మండిపడ్డారు. ఎన్ని నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయో ఎప్పుడైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. గండికోట ముంపు ప్రాంతాల వారికి 10 లక్షల పరిహారం చెల్లించారా అని క్వశ్చన్ చేశారు. పోలవరం చిద్రమౌతుంటే చూస్తూ కూర్చున్నారు.. వరద ప్రాంతాలను హైవే నుంచి, రైలు ప్రమాదాన్ని హెలికాప్టర్ నుంచి చూసిన ఆయన అవగాహన రాహిత్యం బయట పెట్టుకున్నారని సత్యకుమార్ పేర్కొన్నారు.