ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు : చంద్రబాబుకు జగన్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గతంలో కంటే… ఇప్పుడు వరద బాధితులకు తొందరగా సహాయాన్ని అందించగలిగారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని… గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని చంద్రబాబుకు చురకలు అంటించారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని… గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని ఫైర్ అయ్యారు సీఎం జగన్.
అలాంటిది ఇవాళ వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నామని.. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లని తెలిపారు. మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని.. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తి చేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్. గతంలో ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని.. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని గుర్తు చేశారు సీఎం జగన్.
Also Read
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..