Srihari Kota: ఈనెల 30న పీఎస్‌ఎల్వీ సీ53 ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఈ కౌంట్ డౌన్ 25 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది.
ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ-53 వాహక నౌక నింగిలోకి తీసుకెళ్లే మూడు ఉపగ్రహాలలో ఒకటి DS-EO. దీని బరువు 365 కిలోలు. ఈ ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగి ఉంటుంది. మరో ఉపగ్రహం సింగపూర్ దేశానికి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు.
Also Read
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
Read Also:
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!