నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మరో రాకెట్ ప్రయోగానికి వేదిక కానుంది. ఈనెల 30న అక్కడ పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్) కింద ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రయోగ వేదిక వద్దకు రాకెట్‌ను చేర్చారు. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి…