ISRO: ఇస్రోకి ఈ ప్రయోగం కీలకం.. ప్రతిష్టాత్మక ప్రయోగాలన్నీ ఈ రాకెట్ ద్వారే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది… ఇవాళ అంటే 23.10.2022న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.. ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేపథ్యంలో చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ అర్థరాత్రి జరిగే జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం ఇస్రోకి చాలా కీలకం అన్నారు..
Read Also: GSLV Mk3: జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
ఇది పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం.. ఇస్రోలో అతిపెద్ద రాకెట్ ద్వారా ఇతర దేశాల ఉపగ్రహాలను మొదటిసారి పంపుతున్నామని వెల్లడించారు డాక్టర్ సోమనాథ్.. ఇక, త్వరలో చంద్రయాన్, గగన్ యాన్ , మానవ రహిత మానవ సహిత లాంటి ప్రయోగాలన్నీ మార్క్-3 రాకెట్ ద్వారానే చేస్తామని పేర్కొన్నారు. గత నెలలో విఫలమైన ఎస్‌ఎస్ఎల్వీ రాకెట్ స్థానంలో మళ్లీ డిసెంబర్ నెలలో ఈ తరహా ప్రయోగం చేస్తాం అన్నారు డాక్టర్ సోమనాథ్.. నవంబర్ నెలలో పీఎస్‌ఎల్వీ-54 రాకెట్ ప్రయోగం ఉంటుంది. ఈ రాకెట్ ద్వారా OCEAN SAT-3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతామన్నారు.. రేపు జరిగే రాకెట్‌కు సంబంధించి రెండో దశలో ద్రవ ఇంధనం నింపుతున్నారు.. కౌంట్ డౌన్ ప్రక్రియ సవ్యంగానే జరుగుతోందని వెల్లడించారు..
తాజావార్తలు
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!