GSLV Mk3: జీఎస్ఎల్వీ మార్క్3 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి రెడీ అయ్యింది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది… ఈ అర్ధరాత్రి (శనివారం) 12.07 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ కొనసాగుతుండగా.. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత.. అంటే ఇవాళ అర్ధరాత్రి 12.07 గంటలకు (23.10.2022)న (ఆదివారం) అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.. ఇక, ఈ ప్రయోగం ద్వారా 5,200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది రాకెట్.. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ అధీనంలోకి తీసుకోనున్నారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ఎన్ఎస్ఐఎల్‌తో ఒప్పందం తర్వాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉందంటున్నారు.. 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం కుదిరింది.. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారతదేశం నుండి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్–3లో ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. మరోవైపు చంద్రయాన్ -3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్ లో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!