Bhogi Festival: తెలుగు ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి.. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఈ పండుగను నాలుగు రోజుల పాటు చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిగా జరుపుతారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలతో సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా, రెండో రోజును ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజును ‘కనుమ’ పండగగా పిలుస్తారు. ఇక, నాలుగో రోజును ‘ముక్కనుమ’ అంటారు.
Read Also: Pooja : ఇక బుట్టబొమ్మ పని అయిపోయినట్లేనా.. అదే ఆఖరి అవకాశమా ?
కాగా, ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాలు చేసిన తర్వాత ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకికి స్వస్తి పలికి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలల్లో పాత పనికిరాని వస్తువులను, పీడలను వేసి, తమకు ఉన్న అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం స్టార్ట్ అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడును ఈ భోగి మంటలలో వేసి నేటి నుంచి నూతన ఆనంద, ఆప్యాయతలతో ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి ప్రజలు మాట ఇస్తారు.
Read Also: Maha kumbh Mela 2025: నేటి నుంచి మహా కుంభమేళా షురూ..
అయితే, పురాణాల ప్రకారం..
రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తుంటారు. ఆ పరమ శివుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేసినప్పుడు.. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించడంతో.. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని చెప్తుంటారు. ఇక, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి వస్తాడు. ఆ రోజే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగుతో దీనికి అర్కఫలం అనే నామాకరణం వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పిల్లలపై పోస్తుంటారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. దాదాపు 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ భోగి పండ్లను పోయవచ్చు అన్నమాట.
Read Also: PMSBY: సూపర్ స్కీమ్.. ఏడాదికి రూ. 20 కడితే చాలు రూ.2 లక్షలు ఇస్తున్న కేంద్రం!
కాగా, సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజే భోగి పండగా. ఈ రోజు చలి తారస్థాయికి చేరుకుంటుంది. కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సంప్రదాయం వచ్చింది. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే ఛాన్స్ ఉంటుంది.. కనుక, భోగిమంటలు వాతావరణంలోకి వెచ్చదనాన్ని నింపడంతో.. సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పాటు పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తుంటాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఎంతో ఉపయోగపడతాయి.
Read Also: Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం
ఇక, భోగి మంట వెనక మరో అంశం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు. దీంతో ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం స్టార్ట్ అవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బందికి గురైతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని రెడీ చేసినట్లవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి.. భోగి మంటలు కేవలం చలి మంటలే కాదు.. అగ్ని దేవుడిని ఆరాధించుకునే ఒక సందర్భం కూడా.. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు చేశారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను కూడా అంతే పవిత్రంగా ప్రారంభించాలట. ఇందుకోసం సూర్యాదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి.. శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి.. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిదట.