West Godavari Crime: మారిపోయానన్నాడు.. ఇంటికి తీసుకొచ్చి క్రూరంగా చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Brutally Killed Wife In West Godavari: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మారిపోయానని నమ్మించి, బ్రతిమిలాడి భార్యను ఇంటికి తీసుకొచ్చి, అత్యంత క్రూరంగా హతమార్చాడు. తలను రెండు ముక్కలు చేశాడంటే.. అతడు ఎలాంటి రాక్షసుడో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. వీరంపాలెంకు చెందిన గంజి దావీదుకి నిర్మల (30)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. అయితే.. కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయంపై భార్యతో భర్త గొడవ పడేవాడు. దీంతో.. నిర్మల తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఈ క్రమంలో దావీదు మద్యానికి బానిస అయ్యాడు. అప్పటి నుంచి అతని ఆకృత్యాలు మరింత పెరిగాయి.
Spider Nesting Inside Ear: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చూసి షాకైన డాక్టర్లు..
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
కువైట్ వెళ్లిన భార్య తనకు డబ్బు పంపడం లేదంటూ.. కుమార్తెలను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి కుమార్తెల్ని చిత్రహింసలకు గురి చేసే వీడియోని కుమారుడితో రికార్డ్ చేయించి.. కువైట్‌లో ఉన్న నిర్మలకు పంపించాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, దావీదుని అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. అప్పుడు నిర్మల తన పిల్లలతోనే ఉండాలని నిర్ణయించుకొని, కువైట్ నుంచి భారత్‌కు తిరిగొచ్చి, పుట్టింట్లో ఉండసాగింది. కట్ చేస్తే.. రెండు నెలల క్రితం జైలు నుంచి బయటకొచ్చిన దావీదు, తాను మారిపోయానంటూ భార్యను నమ్మించేందుకు ప్రయత్నించాడు. తాను ఈసారి బాగా చూసుకుంటానని, మంచి ఉద్యోగం చేస్తానని నమ్మబలికాడు. తిరిగి కాపురానికి రావాలని బ్రతిమిలాడాడు. తన భర్త ఇంతలా ప్రాధేయపడటం చూసి.. నిజంగానే మారిపోయాడు అనుకొని, మూడు రోజుల క్రితమే కాపురానికి అంగీకరించింది. దీంతో.. తన భార్య, పిల్లల్ని తీసుకొని వీరంపాలంలోకి తన ఇంటికి తీసుకొచ్చాడు దావీదు.
Poonch Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరుగురి అరెస్ట్..
మొదటి రెండు రోజులు బాగానే ఉన్నట్టు నటించాడు కానీ, మూడో రోజు మళ్లీ తన నిజస్వరూపం బయటపెట్టాడు. గురువారం తన భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. అప్పుడే భార్యని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నిర్మల నిద్రలోకి జారుకున్న తర్వాత.. శుక్రవారం వేకువజామున ఆమెను దావీదు అత్యంత కిరాతకంగా చంపాడు. మెడ, చేయి కోసి.. తలను రెండు ముక్కలు చేసి హతమార్చాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాక్ష్యాలు సేకరించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటు తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకెళ్లడంతో.. ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!