Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. 27 కంపార్ట్‌మెంట్లు ఫుల్..!

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
  • వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు..
  • శ్రీవారి దర్శనానికి 16గంటల సమయం..
Tirumala

Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా నిన్న (మంగళవారం) సాయంత్రానికి క్యూ లైన్‌లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే, వీరికి దాదాపు 16 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అలాగే, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారని చెప్పారు. వీరికి రెండు గంటల్లో శ్రీనివాసుడి దర్శనం లభించనుంది అన్నారు.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్ వరుసగా నాల్గవ రోజు గాజాపై దాడి.. పాఠశాలలో ఆశ్రయం పొందిన 19 మంది మృతి

అయితే, నిన్న శ్రీవారిని 67, 245 మంది భక్తులు దర్శించుకున్నారు. 25, 054 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4.51 కోట్ల రూపాయాల హుండి ఆదాయం వచ్చింది. కాగా, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ పాలు, కాఫీ, ఉప్మా అందిస్తుంది.