Ponnam Prabhakar : హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా నిర్మితమైన చలనచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరగింది. సినిమా చూసిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య, ఎంపీ సురేష్ షెట్కర్,…
దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారు.. తన సతీమణి సావిత్రి బాయి పూలే ద్వారా మహిళలను విద్యావంతులను చేశారు అని గర్నవర్ బండారు దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
కుల వ్యవస్థ నిర్మూలానికి కంకణం కట్టుకున్న భారత ప్రథమ సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే. ఏప్రిల్ 11 సోమవారం ఆయన 195వ జయంతి సందర్భంగా హిందీలో బయోపిక్ ఒకటి రూపుదిద్దుకోబోతున్నట్టు ప్రకటన వచ్చింది. నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చి ఆ పైన వెబ్ సీరిస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ… జ్యోతిరావ్ పూలే పాత్రను పోషించబోతున్నారు. ‘ఫులే’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బయోపిక్ లో సావిత్రి బాయి పూలేగా జాతీయ…