Harsha Reddy Anwar Arrested In Tirupati Extramarital Affair Case: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో.. ప్రియుడిపై RIP అంటూ ప్రచారం చేసిన భర్తను నిందితులు శిరోముండనం చేసిన విషయం తెలిసిందే! తిరుపతిలో సంచలనం రేపిన ఈ కేసులో పోలీసులు తాజాగా పురోగతి సాధించారు. ఆ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి.. నిందితుల భరతం పట్టారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Pushpa 2: షెకావత్ సర్ vs పుష్ప రాజ్… హైదరాబాద్ షెడ్యూల్ లో ఫేస్ ఆఫ్
తిరుపతిలోని చంద్రగిరికి చెందిన వంశీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్యతో హర్షా రెడ్డి అనే ఫైనాన్షియర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన వంశీ.. సోషల్ మీడియాలో హర్షా రెడ్డి, అతని స్నేహితుడు అన్వర్‌లపై RIP అంటూ ప్రచారం చేశాడు. ఈ పోస్టింగ్స్ చూసి ఆగ్రహించిన హర్షా, అన్వర్.. బెంగళూరులో ఉన్న వంశీని కిడ్నాప్ చేసి, చంద్రగిరి తీసుకొచ్చారు. అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. అతనిపై మూత్రం పోసి, గుండు గీయించారు. అనంతరం వంశీని బెదిరించి, అతనితో క్షమాపణ చెప్పిస్తూ వీడియో తీయించారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హర్షా, అన్వర్‌లకు ఓ పోలీస్ కానిస్టేబుల్ సహకరించాడు.
Balineni Srinivasa Reddy: ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి
వంశీని శిరోముండనం చేయడం, అతనితో క్షమాపణ చెప్పించిన వీడియోలు వైరల్ అవ్వడంతో.. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుడికి, అతని కుటుంబానికి ధైర్యం చెప్పారు. వాళ్లిచ్చిన ధైర్యంతో వంశీ ఎట్టకేలకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, నిందితులైన హర్షా, అన్వర్‌లను అరెస్ట్ చేశారు.