హనుమాన్ జయంతి వేడుకల్ని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి అలయం ఎదుట ఉన్న బేడీ అంజనేయ స్వామి అలయం..ఆకాశగంగ తీర్ధంలో వున్న బాలహనుమాన్ దేవాలయాలలో టీటీడీ…జపాలిలో కొలువైన భక్తాంజనేయస్వామి ఆలయంలో దేవాదాయశాఖ…ధర్మగిరి వద్ద వున్న ఆభయ ఆంజీనేయస్వామి ఆలయంలో తిరుమల స్ధానికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీటీడీ తరపున ఆలయ అధికారులు బాలహనుమాన్ తో పాటు జపాలి హనుమంతుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీరామదూతగా… సేవాతత్పరుడిగా…అఖండబలశాలైన హనుమంతుడిని పూజించని వారుండరంటే అతిశయోక్తికాదు.అంజనీ తనయుడి జయంతి వేడుకల్ని తిరుమల కొండ పై ఘనంగా నిర్వహించారు. తిరుమలేశుడు కొలువైన అనంద నిలయానికి ఎదురుగా చేతులకు బేడీలతో వున్న అంజనేయస్వామి ఆలయంలో టీటీడి ప్రత్యేక పూజలను నిర్వహించింది. వివిధ సుగందద్రవ్యాలతో స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చిన వస్త్రాలను అలంకరింపజేసారు.
అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.హనుమంతుడి జన్మస్ధలంగా టీటీడీ నిర్ధారించిన ఆకాశగంగ తీర్ధంలోనూ హనుమజ్జయంతి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది.బాల హనుమంతుడితో పాటు అంజనాదేవికీ వివిధ సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాని నిర్వహించన అనంతరం శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ప్రసాదాలను నివేదించారు.
ఐదు రోజుల పాటు టీటీడి ఇక్కడ జయంతి వేడుకలను నిర్వహించనున్నది.మరో వైపు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలిచిన తీర్ధం జపాలి.జపాలి అనే మహర్షి తపస్సుకు మెచ్చిన హనుమంతుడి ఇక్కడ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడన్నది స్ధలపురాణం. హధీరాంజీ మఠం ఆధ్వర్యంలో దేవాదాయశాఖ హనుమాన్ జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించింది.జపాలిలో కొలువైన భక్తాంజనేయ స్వామికి టీటీడీ తరపున శ్రీవారి ఆలయ అధికారులు పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
తిరుమలలోని స్ధానికులు,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో జపాలీ క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది.వేలాది మంది భక్తులు భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి జపాలీ క్షేత్రానికి వచ్చిన భక్తులకు….అలాగే హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులకు అంజనేయ భక్త బృందం అధ్వర్యంలో అన్నదానం,మజ్జిగ పంపిణీ చేశారు. జపాలీ తీర్ధంకు వెళ్ళే దారిపొడవునా మరియు తీర్ధంలో పలు భక్త బృందాలు అక్కడికి విచ్చేసిన భక్తులకు విరివిగా పలు రకాల ప్రసాదాలు పంపీణి చెయ్యడంతో పాటు మజ్జిగ,నీరును కూడా పంపిణీ చేశారు.ప్రతి ఏటా ఆంజనేయ మాల ధరించిస్వామి వారిని దర్శించుకోవడం పరిపాటి. అందులో భాగంగానే స్వామి వారిని దర్శించుకుంటున్నామని భక్తులు అన్నారు.
ఇక తిరుమలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ధర్మగిరి వేదపాఠశాల వద్ద వున్న అభయ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటైతారు.భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.ఇక్కడ పలువురు భక్తుల ఆధ్వర్యంలో ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు,పండ్లతో సుందరంగా అలంకరించారు.
Ban on Sugar Exports: కేంద్రం కీలక నిర్ణయం… పంచదార ఎగుమతులపై నిషేధం