Tension in Tenali: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చంద్రబాబు కాలనీలో చిన్న పిల్లల గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. చిన్న పిల్లల మధ్య జరిగిన తగువులో సర్ది చెప్పినందుకు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఘర్షణ పడొద్దు అని చెప్పిన బాధిత కుటుంబ సభ్యులపై కొంత మంది దాడికి పాల్పడ్డారు. ఇక, బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్రలు, ఇనుప రాడ్లు, బీరు బాటిళ్లతో విచక్షణా రహితంగా తమపై దాడి చేశారని పేర్కొన్నారు. సుమారు 10 మంది గంజాయి మత్తులో వచ్చి తమతో పాటు కుటుంబ సభ్యులను కూడా కొట్టారని ఆరోపించారు.
Read Also: Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
అయితే, ఈ దాడిలో గాయపడిన రెహమాన్ అనే వ్యక్తి ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు బాధిత కుటుంబ ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.