Ambati Rambabu: జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..
- వైఎస్ జగన్.. తిరుమల పర్యటన రద్దుకు కారణం ప్రభుత్వమే..
- తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు..
- జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు..
- అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు..
- జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారన్న అంబటి రాంబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.. ఇది వైఎస్ జగన్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగాగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు.. కానీ, అప్పుడు అడ్డుకోలేదు.. కానీ, ఇప్పుడు మతాలు గుర్తు వస్తున్నాయి.. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు, రాజకీయాలకు దేవుడ్ని వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని వ్యాఖ్యానించారు.. జగన్ కు కుట్ర, కుతంత్రాలు తెలియవు.. నిజాయితీగా మాట్లాడటమే తెలుసు అని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
Read Also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శుక్రవారం రోజు రాత్రికి తిరుమలకు వైఎస్ జగన్ చేరుకోవాల్సి ఉండగా.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకునేది ఉంది.. ఇక, జగన్ పర్యటన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తిరుమల, తిరుపతికి చేరుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. ఉన్నట్టుండి.. తన తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే.. అంతేకాదు.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి అంటూ ఈ సందర్భంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!