వైఎస్ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు..