Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Hunger Strike: గుంటూరులో తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబబు నిరాహార దీక్ష చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఉదయం ఆరు గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన.. సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష కొనసాగుతుంది ప్రకటించారు.. ఇక, అంబటి రాంబాబు దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, వేమారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి జరిగిందన్నారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని పేర్కొన్నారు.
Read Also: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
తాను చంద్రబాబు నాయుడును దూషించాననే ఆరోపణలతో అరెస్టు చేసి 18 రోజులు జైలులో ఉంచారని, అయితే తన ఇంటిపై దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా జైలుకు పంపించారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.. తనను అరెస్టు చేసిన అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో హింసించేందుకు ప్రయత్నించారని, కస్టోడియల్ టార్చర్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఈ దాడి వెనుక నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టబోనని, వారిని జైలుకు పంపించే వరకు తన పోరాటం ఆగదన్నారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని విమర్శించారు. ఇద్దరు సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తనను భయపెట్టాలనుకుంటే అది వారి పొరపాటేనని, చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు అంబటి.. ప్రాణాలకు తెగించైనా చట్టపరంగా మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. దాడి ఘటనపై న్యాయపోరాటం, ప్రజాపోరాటం రెండూ చేస్తానని, తాను చేస్తున్నది ధర్మపోరాటమని తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతు ఇస్తున్నారని కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ అధినేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?