Goutham Reddy Cook: దుబాయ్ నుంచి వచ్చాక అస్వస్థత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు.
తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి లేస్తుందని కుప్పకూలిపోయారని వెల్లడించాడు కొమురయ్య. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. రోజూ ఉదయం కాఫీ తాగే వారు కానీ ఇవాళ ఆయన కాఫీ కావాలని అడగలేదు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తెలిపారు కొమురయ్య.
Also Read
మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతిపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలు అందించారు. చిన్న వయస్సులో మృతి చెందడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రకటనలో వెల్లడించారు గవర్నర్.
గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి అనిల్ అక్కడికి చేరుకున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు కోడలు అస్మిత్-నిస్సలతో గౌతమ్ రెడ్డి చివరి సెల్ఫీ
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే బాధగా ఉంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది. పార్టీలతో సంబంధం లేకుండా గౌతమ్ రెడ్డి అందరితో స్నేహంగా మెలిగేవారు.గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాలకృష్ణ.
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం.రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం. విద్యాధికుడైన గౌతమ్ రెడ్డి ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తండ్రి రాజమోహన్ రెడ్డికి.. కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి అని ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?