విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అందరిలానే సింపుల్ గా బయటకు వస్తున్నాడు. అతడిపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అతడి లగేజీ చెక్ చేశారు.. ఎమి దొరకలేదు.. మళ్లీ అనుమానంతో మరో సారి గట్టిగానే తనిఖీలు చేపట్టారు.. దీంతో అసలు విషయం బయటపడింది. ఇస్త్రీ పెట్టెలో లక్షల విలువైన బంగారాన్ని చూసిన ఎయిర్ పోర్ట్ అధికారులు నోరు వెళ్లబెట్టారు.
Read Also: Meta-Brain Robot : హ్యుమన్ స్టెమ్ సెల్స్ తో రోబోట్.. అభివృద్ధి చేసిన చైనా..
అయితే.. ఇస్త్రీ పెట్టెలో భారీగా బంగారాన్ని తీసుకువస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అథారిటీ. బట్టలు ఐరన్ చేసే ఇస్త్రీ పెట్టెలో ఏకంగా రూ.1.55 కోట్ల విలువైన బంగారం దాచడంతో ..అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. వైఎస్‌ఆర్ కడప జిల్లా పొద్దుటూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇటీవల షార్జాకు వెళ్లాడని అధికారులు వెల్లడించారు. అయితే అతడు షార్జా నుంచి 1200 గ్రాముల బరువున్న 11 బంగారం బిస్కెట్లను తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల చెకింగ్స్ నుంచి తప్పించుకోగలిగాడు. అయినప్పటికి గ్రీన్ ఛానల్ నుంచి బయటకు వెళ్లిపోతున్న టైంలో తమకు అడ్డంగా దొరికిపోయాడని అధికారులు చెప్పుకొచ్చారు.
Read Also:Side Effects: బంగాళాదుంపలు ఎక్కువగా తింటున్నారా.. అయితే బీకేర్ ఫుల్…
అయితే దొరికిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. నిందితుడితో పాటు.. మరో వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ బంగారం ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన మరో వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.