Kishan Reddy : తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నకిలీ వాగ్దానాలు, చేతకాని పాలన, మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారీగా బస్సు ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర భారాన్ని మోపుతోంది. ఇది సామాన్య ప్రజల జీవనంపై నేరుగా దెబ్బతీసే నిర్ణయం. ఇలాంటి ప్రజా…
Anugula Rakesh Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల పేదలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..”అందగత్తెల కోసం పేదల షాపులను కూల్చడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి, అందగత్తెలతో రాష్ట్రానికి…
Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని…
Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్ప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85.96 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్థుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి. Also Read: Fire Accident:…
Botsa Satyanarayana : విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి…
ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్‌లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు.
KCR : అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు…
నెల్లూరులో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాలు, కార్పొరేటర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేశారని.. ఐదేళ్లపాటు నియంత పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు.