Gas Leak: గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.
బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో రానుంది. డిజిటల్ మీటర్ల ద్వారా గ్యాస్ లీక్ తీవ్రతను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. NTV తో అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ మాట్లాడారు. మరోవైపు గ్యాస్ లీక్ బాధితులతో నిండిపోయింది అనకాపల్లి ఆసుపత్రి.ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు.
Also Read
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో బెడ్స్ కోసం ఇబ్బంది తప్పడం లేదు. బెడ్స్ కెపాసిటీ 120 కాగా గ్యాస్ లీక్ బాధితుల సంఖ్యే 130వుంది. ఆసుపత్రి రద్దీ పెరగడంతో ఉషా ప్రైం, సత్యదేవ, అగనంపూడి పీహెచ్ సీలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు NTR ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. యాజమాన్యం వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలితే కఠినంగా వ్యవహారిస్తాం అన్నారు మంత్రులు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్ కు చేరుకుంటున్నారు గ్యాస్ లీక్ ఘటన లో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు. అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న సత్యవతి, దమయంతి. బాధితుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. NTR ఆసుపత్రిలో గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. 48గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీఅయ్యాయి. గ్యాస్ లీక్ తర్వాత ఇళ్లకు వెళ్లిపోయిన కొంత మందికి స్వల్ప సమస్యలు వేధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది యంత్రాంగం.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం బాధాకరం అన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందన్నారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!