Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ganta Srinivasa Rao To Will Quits Tdp And Likely To Join In Ysrcp

Ganta Srinivasa Rao: టీడీపీకి ఝలక్..! పార్టీకి గంటా గుడ్‌బై..? చిరుతో భేటీ తర్వాత నిర్ణయం..!

Published Date :November 26, 2022 , 11:57 am
By Sudhakar Ravula
Ganta Srinivasa Rao: టీడీపీకి ఝలక్..! పార్టీకి గంటా గుడ్‌బై..? చిరుతో భేటీ తర్వాత నిర్ణయం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించి.. సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు టీడీపీకి గుడ్‌బై చెబుతూనే ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి రాజీనామా చేసి.. స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, పార్టీ సీనియర్‌ నేత, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. అయితే, గంటా శ్రీనివాస్‌రావు.. టీడీపీని వీడతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడు గంటా ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారట.. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మరడంపై సందిగ్ధత వీడిపోయిందని.. ఈ డిసెంబర్‌లోనే ఆయన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

Read Also: MLA’s Poaching Case: సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరనున్నట్టు తన సన్నిహితుల దగ్గర గంటా శ్రీనివాస్‌రావు చర్చించినట్టుగా సమాచారం.. అయితే, పార్టీని వీడేకంటే ముందు మెగాస్టార్‌ చిరంజీవితో ఆయనే సమావేశం కానున్నారట.. హైదరాబాద్‌ వెళ్లనున్న గంటా శ్రీనివాస్‌రవు.. చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.. ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు.. ఇక, డిసెంబర్‌ 1వ తేదీన గంటా శ్రీనివాస్‌రావు పుట్టిన రోజు ఉంది.. ఆ వేడుకల తర్వాత.. వైసీపీలో చేరనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యే బహిరంగ సభ వేదికపైనే గంటా శ్రీనివాసరావు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకునే దిశగా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అయితే, గంటా శ్రీనివాస్‌రావుకు మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. చిరు కూడా ఆయన్ను సొంత సోదరుడిలా చూసుకుంటారు. అనేక సందర్భాల్లో వీరిద్దరు కలిశారు. అంతేకాదు, గంటా శ్రీనివాస రావు 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీలో చేరారు. 2014 నుంచి 2019 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన వారిలో గంటా కూడా ఒకరు..

ఇక, వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. టీడీపీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనడంలేదు గంటా శ్రీనివాస్‌రావు.. దాంతో, ఆయన టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. దానికి మరింత బలం చేకూర్చే విధంగా ఆయన చేష్టలు కూడా ఉన్నాయి.. చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. గంటా కనిపించని సందర్భాలు ఉన్నాయి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటాతో భేటీకి చంద్రబాబు కూడా ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలతో ఈ ఏడాది మే నెలలో చంద్రబాబు సమావేశమయ్యారు. గంటాకు కూడా ఆహ్వానం పంపినా.. అనారోగ్య కారణాలతో తాను సమావేశానికి రాలేనని ఆయన తెలియజేశారట.. ఇలా ఎన్నోసార్లు ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఇక ఫైనల్‌గా వైసీపీలో చేరేందుకు డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. దానికి ముందే చిరంజీవిని కలిసి.. ఆయనతో చర్చించిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • Chiranjeevi
  • ganta srinivasa rao
  • tdp

తాజావార్తలు

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

  • Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

  • Air India: ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్.. మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేత

  • PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions