ఏపీలో అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం దుర్మార్గం అన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కరకట్ట పై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు. అత్యున్నత సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది…దాన్ని మేము కూడా ఆహ్వానించాం. కానీ దర్యాప్తులో వాస్తవాలను తెలుసుకోకుండా పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు శ్రీకాంత్ రెడ్డి.
దర్యాప్తులో మేం ఎందుకు కల్పించుకుంటాం. సీబీఐ తోక కత్తిరిస్తాం… రాష్ట్రంలోకి రానివ్వం అన్న మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రామ్ సింగ్ పై ప్రభుత్వం కేసు పెట్టించింది అని మాట్లాడుతున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ 27 జనవరిలో ఫిర్యాదు చేసారు. కేసు ఫైల్ కాలేదు అని రెండోసారి 17వ తేదీ ఫిర్యాదు ఇచ్చారు . కోర్ట్ ఆదేశాలతో కేసు నమోదైంది..దానిపై మీరు మాట్లాడటం ధిక్కరణ కాదా ? రామ్ సింగ్ ని హత్య చేసే నైజం మీలాగా మాకు లేదు. రంగా, పింగళి దశరథ్ లాంటి వారిని చంపించిన ఘనత మీదేనని టీడీపీపై విరుచుకుపడ్డారు. చనిపోయిన వ్యక్తి మా నాయకుడి చిన్నాన్న. దానిని మీ రాజకీయ ప్రయోజనాలను వాడుకుంటున్నారు.
ఎందుకంత మీకు అత్యుత్సాహం? యదార్థాలు ఏమిటి అని అడిగే హక్కు మాకుంది…అవినాష్ మా ఎంపీ. వాస్తవాలు బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరినో నిందించాల్సిన అవసరం మాకు లేదన్నారు శ్రీకాంత్ రెడ్డి. మీరేది చేస్తే మేమూ అదే చేస్తాం అనుకోవడం మీ భ్రమ మాత్రమే అన్నారు. ఎందుకు ఆ లేఖ సాయంత్రం వరకూ బయటకు రాలేదు అని అడుగుతున్నాం. ఉదయ్ కుమార్ కి మాకేంటి సంబంధం..? మేము ఎవర్ని సపోర్ట్ చేయడం లేదు…నిందించడం లేదు. వాస్తవాలు బయటకు తీయండి అని మాత్రమే అడుగుతున్నాం. ఆ లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి…ఇవన్నీ చూస్తే అనుమానాలు రావా? అన్నారు.
వివేకా చనిపోయి మేము ఎంత బాధలో ఉన్నాం అనేది మాకు తెలుసు. ఒక జైలర్ రొటీన్ ట్రాన్స్ ఫర్ లో వస్తే నానా యాగీ చేశారు. ఎప్పుడు కుట్రలో బతికే బతుకు మీది. రాజకీయాల్లో ఒక హుందాతనం లేదా…ఎందుకింత దిగజారిపోతున్నారు. నిత్యం వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు. సిట్ రిపోర్ట్ ఏమిచ్చిందో రానివ్వండి. సినీ రంగం సమస్యలను పరిష్కారించాలంటే దాన్నీ రాజకీయం చేస్తారు. మీరు అవాస్తవాలను మాట్లాడుతున్నందుకు మీపై కేసు వేయవచ్చు అన్నారు శ్రీకాంత్ రెడ్డి.