ఏపీ దేవాదాయ శాఖలో ఏసీ, డిసి వివాదం పై మొదటి రోజు విచారణ ముగిసింది.ఇద్దరి నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు రీజనల్ జాయింట్ కమిషనర్ సురేష్. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… ఈ వివాదానికి సంబందించి దేవాదాయ కమిషనర్ కు త్వరలోనే నివేదిక సమర్పిస్తాం. వీరు ఇద్దరి తో పాటు సంఘటన జరిగిన ముగ్గురు అధికారులు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం. గతంలో ఈయన పై ఉన్న ఫిర్యాదు లపై చర్చించాం అన్నారు.
అలాగే అసిస్టెంట్ కమిషనర్ శాంతి మాట్లాడుతూ… ఆరు పేజీలుతో కూడిన రిపోర్ట్ ను అందజేశాను. దీనికి సంబందించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. దేవాదాయ శాఖ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాను అని పేర్కొన్నారు.