Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family doctor implements from august 15th in andhra pradesh: ఏపీలో వచ్చేనెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. మంగళగిరిలో సోమవారం నాడు వైద్య ఆరోగ్యశాఖపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలకు వెళ్లే వైద్యుల వద్ద ప్రతి రోగి ఆరోగ్య కార్డు ఉంటుందన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్‌సీలకు అనుబంధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతుందని మంత్రి విడదల రజినీ చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాధుల వల్ల మరణాలు సంభవించకూడదని ఆమె అధికారులకు సూచించారు.
Read Also: Vijayawada GGH Hospital:సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల తిప్పలు
Also Read
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులతో ఎవరైనా చనిపోయినట్లు తమ దృష్టి వస్తే అక్కడి వైద్య అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి విడదల రజినీ హెచ్చరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేలా ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమ తెరల పంపిణీకి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజినీ సూచించారు. కాగా వైఎస్ఆర్ బీమా ఉండి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.20వేలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల కుటుంబానికి హ్యాప్ పే కార్డులను అందజేయనుంది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కార్డులను చేరుస్తున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..