Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్..
- ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ తెచ్చిన సర్కార్..
- సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని తీరును మరింత పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ యాప్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యం, గైర్హాజరు లాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Read Also: Astrology: జనవరి 17, శనివారం దినఫలాలు..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇక, ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఈ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫీల్డ్‌లో పని చేస్తున్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ఇటీవల కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీసుల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదని, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి అని సర్కార్ సీరియస్‌గా తీసుకుంది.
Read Also: Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!
కాగా, ప్రజలకు నేరుగా సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగుల పని తీరును మెరుగుపరచడం, జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ కొత్త విధానం అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!