దేశంలో 12 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. వేసవి కారణంగా ఏపీలో డిమాండ్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ కొరత నెలకొంది. దీంతో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించగా..…
ఏపీలో కరెంటు కష్టాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో సగటు విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే.సాధారణంగా ప్రతీ వేసవిలో ను 204 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. కానీ కోవిడ్ తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిపోయింది. పరిశ్రమలు, ఆర్ధిక లావాదేవీలు పూర్తి స్థాయిలో జరుగుతున్న కారణం గా 240 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరిందన్నారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే వాలంటీర్లకు సన్మానం పేరుతో రూ.233 కోట్లతో తగలేస్తూ పండగ చేసుకుంటున్న ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ కోతలతో ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. విద్యుత్ సరఫరా…