Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్.. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా..?
- పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి?..
- ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
- ఏలూరు ఆర్.ఎం.ఓ కు మంత్రి సారథి సీరియస్ వార్నింగ్..
- ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి పార్థసారథి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ పై మండిపడ్డారు.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
తాజాగా, నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతిచెందిందని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ కు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి, బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు? గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలోనూ ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం.ఓ ను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవర్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!