Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
- Realme 17 Pro+కు భారీ కెమెరా అప్‌గ్రేడ్
- 200MP సెన్సార్‌తో వస్తున్న కొత్త ఫోన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 17 Pro+: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ మరో ప్రీమియం ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రియల్మీ 17 ప్రో+కు సంబంధించి వరుసగా లీకులు, నివేదికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లో 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లే వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే రియల్మీ 17 ప్రో+ గురించి కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు లీకులు, నివేదికల ఆధారంగా వచ్చినవే.
1.5K OLED డిస్ప్లే
లీక్‌ల ప్రకారం రియల్మీ 17 ప్రో+లో 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉండవచ్చు. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌కు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇంకా వెల్లడికాలేదు. మునుపటి మోడల్లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే అందుబాటులో ఉండేది. దీంతో కొత్త మోడల్లో కూడా హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
200MP ట్రిపుల్ కెమెరా సెటప్
రియల్మీ 17 ప్రో+లో కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం ఫోన్ వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉందని సమాచారం.
3.5x ఆప్టికల్ జూమ్
50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా 3.5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేయవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. దీంతో దూరంలోని వస్తువులు, వ్యక్తులను ఫొటోలు తీసేటప్పుడు మెరుగైన వివరాలను క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధాన కెమెరా కోసం Samsung HP5 200MP సెన్సార్, పెరిస్కోప్ కెమెరా కోసం Samsung JN5 50MP సెన్సార్ ఉపయోగించే అవకాశం ఉందని గత నివేదికలు పేర్కొన్నాయి.
రియల్మీ 16 ప్రో+ తరహా కెమెరా?
రియల్మీ 17 ప్రో+ కెమెరా సెటప్ మునుపటి రియల్మీ 16 ప్రో+తో పోలిస్తే పెద్దగా మారకపోవచ్చని తెలుస్తోంది. రియల్మీ 16 ప్రో+లో కూడా 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే కొత్త మోడల్లో కెమెరా సాఫ్ట్వేర్, ఇమేజ్ ప్రాసెసింగ్, జూమ్ పనితీరులో ఇంప్రూవ్ మెంట్స్ ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌పై కూడా ఫోకస్
రియల్మీ 17 ప్రో+లో పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రియల్మీ 17 ప్రో+ ఎప్పుడు లాంచ్?
రియల్మీ 17 ప్రో+ విడుదల తేదీని కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఫోన్ స్పెసిఫికేషన్లను కూడా రియల్మీ ధృవీకరించలేదు. ప్రస్తుతం వచ్చిన సమాచారం లీకులు, నివేదికలపై ఆధారపడి ఉంది. ఇవి నిజమైతే 200MP కెమెరా, 3.5x పెరిస్కోప్ ఆప్టికల్ జూమ్, 1.5K OLED డిస్ప్లే వంటి ఫీచర్లతో రియల్మీ 17 ప్రో+ ప్రీమియం కెమెరా స్మార్ట్‌ఫోన్ విభాగంలో మంచి పోటీని ఇవ్వొచ్చు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
Astrology: సెప్టెంబర్ 11 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికే డబ్బులే డబ్బులు..!
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?