Mango Bay Resorts Club: ఏలూరు జిల్లాలో మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ లో పోలీసుల సోదాల్లో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. తమకు అనుమతి ఉందని మ్యాంగ్ క్లబ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు గుర్తించారు. మ్యాంగో క్లబ్ కు అనుమతి ఉందని తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఏలూరు పోలీసులపై భీమవరం, నరసాపురం, ఏలూరు, జంగారెడ్డి గూడెం క్లబ్స్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. తాము ఎవరికి అనుమతి ఇవ్వలేదని ఏలూరు జిల్లా పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Modi-New Zealand: న్యూజిలాండ్ ప్రధానితో మోడీ సంభాషణ.. కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
అయితే, రాష్ట్రవ్యాప్తంగా క్లబ్ లకు అనుమతి ఇవ్వాలంటూ మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ వ్యవహారం పోలీసుల దృష్టికి వేరే క్లబ్స్ తీసుకు రావటంతో ఈ క్లబ్ పై దృష్టి పెట్టారు. దీంతో మ్యాంగ్ బే రిసార్ట్ క్లబ్ లో 20 గంటలుగా పోలీసుల సోదాలు చేస్తున్నారు. పేకాడుతున్న 281 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిన్నటి నుంచి క్లబ్ లోనే పేకాట ఆడుతున్న వారు ఉన్నట్లు తెలిపారు. తమ వారి కోసం క్లబ్ దగ్గరకు సన్నిహితులు వస్తున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అందరినీ నూజివీడు కోర్టులో హాజరు పరచటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 32 లక్షల నగదుతో పాటు కాయిన్స్ సీజ్ చేశారు. 150 కార్లు, 40 టూ వీలర్స్ ను కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు.