Andhra Pradesh: అవి పులులు కాదు.. పిల్లులు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు..

  • నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం..
  • భయాందోళనకు గురైన స్థానికులు..
  • ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో ఘటన..
  • అవి పిల్లి పిల్లలేనని తేల్చిన స్థానికులు..
Cat

Cat

Andhra Pradesh: అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Budget 2025 : ఆర్థిక సర్వే అంటే ఏమిటి.. బడ్జెట్ ముందు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని అది ఎలా తెలియజేస్తుంది?

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గురు గ్రామంలో నాలుగు పిల్లి పిల్లలను చూసి పులి పిల్లలని ప్రచారం జరగటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. గతంలో ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కి ఓ పులి మృతి చెందింది.. అయితే, చనిపోయిన ఆ పులి పిల్లలు ఇక్కడ తిరుగుతున్నాయని సోషల్ మీడియా ఓ పోస్ట్‌ పెట్టడంతో.. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు హడలిపోయారు.. నిజంగా పులి పిల్లలే తిరుగుతున్నాయామేనని భయాందోళనకు గురయ్యారు.. అయితే, కొందరు ధైర్యం చేసి ఆ పిల్లలను పట్టుకుని చూస్తే అవి పిల్లి పిల్లలు అని తెలవటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పులి పిల్లలు తిరుగుతున్నాయని బాగా భయపడ్డామని గ్రామస్తులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మి భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు అధికారులు..