Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantha Babu Case: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్లపై రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి భోజనం అందించడంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ అనంతబాబు కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం అనంతబాబును పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను జైలు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల వివరాలను న్యాయమూర్తి పరిశీలించారు.
ఇక, వెన్నుపూస, మెడ సంబంధిత ఆరోగ్య సమస్యలపై సమర్పించిన నివేదికలను పరిశీలించిన కోర్టు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సంబంధిత నిపుణులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేరని అధికారులు కోర్టుకు తెలియజేశారు. పూర్తి వైద్య నివేదిక అందిన తర్వాత ఇంటి భోజనం, ఇతర ప్రత్యేక సదుపాయాల అంశంపై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదే సమయంలో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ చేపట్టింది. అనంతబాబుకు నేరచరిత్ర ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల భద్రతకు, కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌తో పాటు ప్రత్యేక సదుపాయాల పిటిషన్‌పై ఈ నెల 29న తీర్పు వెలువరించనున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.
Also Read
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
తాజావార్తలు
-
Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
-
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
-
Perni Nani: సిట్ విచారణపై వైసీపీ తీవ్ర అభ్యంతరం.. సాయికృష్ణ కేసులో విచారణ డొల్ల..!
-
Hangover Relief Tips: హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించండి..
-
Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!