Site icon NTV Telugu

Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్‌ నేత డిమాండ్‌

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్‌ కల్యాణ్‌ తనకు చిరకాల మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాదు… ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దీంతో, విజయసాయిరెడ్డి చూపు.. కూటమి పార్టీల వైపు ఉందా..? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. అయితే, కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Butchaiah Chowdary: లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

ఒకవేళ బీజేపీ చేర్చుకున్నట్లైతే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదాం అనుకుంటే.. చేర్చుకోవడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం వుందా కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు. విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ప్రజాబలం తో 164 సీట్లు కూటమికి వచ్చాయని, ఇప్పుడు అక్రమాలు చేసిన నాయకులు వస్తామని చెబితే దేనికోసం అని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్ఠానం ఆలోచించుకుంటుందని పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Exit mobile version