Pawan Kalyan: జగన్ ఇది 2009 కాదు.. 2024.. గుర్తు పెట్టుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Mohan Reddy: ఇది 2009 కాదు.. 2024.. జగన్ గుర్తు పెట్టుకోవాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. రౌడీయిజానికి నేను భయపడను.. మనల్ని తన్ని తగలేస్తే.. మనం కూడా తన్ని తగలేయాలన్నారు.వేరే కులాలకు మంత్రి పదవి ఇస్తారు కానీ.. ప్రాక్సీ ఎమ్మెల్యేలుగా వాళ్ల గుంపే ఉంటుంది అని తెలిపారు. ఇక, పుష్ప ( Pushpa ) సినిమా చూడడానికి బాగుంటుంది.. కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్లని నిజ జీవితంలో భుజానికి ఎత్తుకోగలమా..? అని ప్రశ్నించారు. తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.. టిక్కెట్లు అమ్మేస్తున్నారు.. శ్రీవాణి ట్రస్టుని దోచేస్తున్నారు.. గతంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు వంటి వారు చెబితే నేనూ మాట్లాడాను అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, అలాంటి రమణ దీక్షితులు కూడా టీటీడీ ( TTD )లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడ్డం లేదు.. రాయలసీమతో నాకిదే సమస్య.. తొడగొట్టడాలు నాకు తెలీదు.. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: Suhas: నా బతుకేంటో నాకు అర్థం కావడం లేదు.. నీ ఫ్యూచర్ ఎవడికి కావాలి?
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
ఇక, ఆరణి శ్రీనివాస్ ( Arani Srinivas ) నాకు 2008 నుంచి పరిచయస్తుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డాడు.. ఏం ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారని తెలిపారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది.. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు.. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది.. రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతు ఇస్తున్నారు.. కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు.. ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ది కాదు అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చెప్పారు.
Read Also: EPFO: ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
రాయల వారు ఏలిన నేల రాయలసీమ.. ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ అని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వెల్లడించారు. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది.. ఇక, 2019లో నేను ఓడిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది.. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది.. నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది.. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు.. జనసేన ( Janasena ) ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు అని జనసేనాని తెలిపారు.
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!